పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
స్టేషన్ మహబూబ్‌నగర్: పట్టాల మరమ్మతుల (రోలింగ్ బ్లాక్ ప్రోగ్రాం) నేపథ్యంలో ఉమ్మడి జిల్లా మీదుగా పలు రైళ్లను ఆయా రూట్లలో తాత్కాలికం రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 17023/17024 సికింద్రాబాద్–కర్నూల్‌టౌన్ (తుంగభద్ర) రైలు గద్వాల–కర్నూల్ మధ్య ఈనెల 8, 11, 15. 18, 22, 29 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేశారు. ఈరైలు సికింద్రాబాద్ నుంచి గద్వాల వరకు నడవనుంది. అదే విధంగా 77641/77642 కాచిగూడ–మహబూబ్‌నగర్ రైలు ఈనెల 20, 27 తేదీల్లో షాద్‌నగర్–మహబూబ్‌నగర్ మధ్య తాత్కా లికంగా రద్దు చేయనున్నారు. ఈరైలును కాచిగూడ నుంచి షాద్‌నగర్ వరకు మాత్రమే నడపనున్నారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కానుంది.
9న ఉమ్మడి జిల్లా అండర్–19
బాలికల క్రికెట్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: గద్వాల పట్టణంలోని స్టేడియంలో ఈనెల 9వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 విభాగం బాలికల క్రికెట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాపిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థినులు ఇంటర్‌మీడియట్ ఒరిజినల్ బోనఫైడ్, ఎస్‌ఎస్‌సీ మెమో జిరాక్స్‌తో ఉదయం 9 ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం శ్రీనివాస్ 9885955633 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
పకడ్బందీగా
పీఈసెట్ నిర్వహణ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పీఈ సెట్‌ను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తామని పీయూ వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ అన్నారు. ఈసారి ఈ సెట్ నిర్వహణను పాలమూరు యూనివర్సిటీకి అప్పగించినందుకు గాను ఆయనను మంగళవారం పలువురు ఫిజికల్ డైరెక్టర్లు (పీడీలు) కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ భవిష్యత్‌తో మరిన్ని సెట్‌ల నిర్వహణకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా పీయూకు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కుతాయన్నారు. కార్యక్రమంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా సంఘాల కార్యదర్శులు విలియం బాలరాజు, కురుమూర్తి, కొల్లె చెన్నవీరయ్య, ప్రొఫెసర్ సత్యభాస్కర్ రెడ్డి, పీడీలు వెంకట్‌రెడ్డి, రజిని, యుగంధర్, డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment