మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్
● మహిళా అధ్యాపకులను ఘనంగా
సన్మానించిన వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పీయూలోని లైబ్రరీ ఆడిటోరియంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు ఉన్న క్రమంలో సావిత్రిబాయి చదువుకొని పలువురు మహిళలకు విద్య నేర్పించి దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలిగా ఘనతను సాధించారన్నారు. మహిళ అభ్యున్నతికి పాటు పడిన ఆమెను నేటితరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహిళలు విద్యా, ఉపాధి, రాజకీయం, ఉద్యోగాల్లో ముందంజలో ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సీ్త్ర, పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు మహిళా అధ్యాపకులను వీసీ ఘనంగా సన్మానించారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, రీసోర్సుపర్సన్ భూమయ్య, వక్త సుభాషిణి, బీసీసెల్ డైరెక్టర్ ప్రవీణ, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ కుమారస్వామి, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, సంధ్యారాణి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment