సింహ వాహనంపై మైసమ్మ దేవత
నవాబుపేట: మండలంలోని కాకర్లపహాడ్ శివారులో పర్వతాపూర్ మైసమ్మ అమ్మవారు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా ఉత్సవాల్లో భాగంగా సోమవారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆలయ అధికారి మదనేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
2,893 బస్తాల
వరిధాన్యం రాక
నవాబుపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు ధాన్యం రాక గణనీయంగా తగ్గిపోయింది. గత రెండు వారాల్లో దాదాపు 89 వేల బస్తాలకు పైగా ధాన్యం రాగా.. ఆదివారం కేవలం 2,893 బస్తాల ధాన్యం మాత్రమే వచ్చింది. కాగా క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,681, కనిష్టంగా రూ.2,656 చొప్పున ధర లభించిందని మార్కెట్ అధికారి రమేష్ తెలిపారు.
కొనసాగుతున్న
ఎస్‌ఎస్‌ఏల సమ్మె
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో సమగ్ర సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 27వ రోజుకు చేరింది. కాగా ‘మా చేతులకు విధించిన సంకెళ్లను తీసి విముక్తి కలిగించాలి’ అంటూ వినూత్నంగా వారు నిరసన వ్యక్తం చేశారు. వీరికి టీటీయూ, యూటీఎఫ్ నాయకులు మద్దతు పలికారు. తమ సర్వీసును క్రమబద్ధీకరించి, పే స్కేలు అమలుతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే రాష్ట్ర జేఏసీ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి.. ఎస్‌ఎస్‌ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఆయా సంఘాల నాయకులు నారాయణ, వెంకటేశ్వర్లు, ఖాజామైనొద్దీన్, విక్రమ్, ఇంతియాజ్, వేణుగోపాల్, చెన్నయ్య, మమత, గీతారాణి, హరిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment