ఉమ్మడి జిల్లా కవులకు పురస్కారాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఆదివారం వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని పండుగ సాయన్న రాష్ట్రస్థాయి సేవా పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు బోల యాదయ్య (సాహిత్యం, కవిత్వం), కేపీ లక్ష్మీనర్సింహ (కథా సాహిత్యం), వనపట్ల సుబ్బయ్య (కవిత్వం), ఎస్.యాదయ్య (ఇంద్రజాలం)లు పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్, చంద్రశేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment