వైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు చేయండి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో రాష్ట్రస్థా యిు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు అవకాశం లభించిందని, జిల్లా గౌరవాన్ని నిలబెట్టేలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇన్‌స్పైర్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన కమిటీల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జడ్చర్లలోని పోలేపల్లి సెజ్‌లో ఉన్న ఎస్‌బీకేఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో వైజ్ఞానిక ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనకు 33 జిల్లాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వస్తారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వసతి, రవాణా, పార్కింగ్ వంటి ప్రధానమైన విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అధికా రులు ఎప్పటికప్పుడు సమన్వయంతో కార్యక్రమాన్ని సమీక్షిస్తూ ఓ ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పర్యవేక్షిస్తారని, ఈ కార్యక్రమం నిర్వహణకు 25 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీలలో వివిధ శాఖల అధికారులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర్ వివరించారు. 33 జిల్లాల నుంచి 2,500 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా పేరును గుర్తించుకు నేలా వసతి ఏర్పాట్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా విద్యా శాఖ అధికారి ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయేందిర, చిత్రంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్
జిల్లా గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి
జడ్చర్లలో 7, 8, 9 తేదీల్లో రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన
కలెక్టర్ విజయేందిర బోయి
Comments
Please login to add a commentAdd a comment