రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
దేవరకద్ర: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని రాష్ట్ర ఎకై ్సజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. శుక్రవారం దేవరకద్ర మార్కెట్‌యార్డు పాలక మండలి చైర్మన్ కథలప్ప, వైస్ చైర్మన్ హన్మంతరెడ్డి, డైరెక్టర్లు, వీరప్పయ్యస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ బీసు నర్సింహారెడ్డిల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 64 ఏళ్లు సమైక్య రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు రూ.64వేల కోట్లు అప్పులు చేశారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పదేళ్లలో రూ.8 లక్షల కోట్లకు అప్పులను పెంచారని విమర్శించారు. కేవలం రూ.4 లక్షల కోట్లే అప్పులు చేసినట్లు హరీశ్‌రావు, కేటీఆర్ ప్రజలు మఽభ్యపెట్టడానికి మాట్లాడుతున్న దాంట్లో నిజం లేదన్నారు. వాళ్లు చేసిన అప్పులకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు. ఏడాది పాలనలోనే ఒక పక్క సర్దుబాట్లు చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు చెప్పారు. రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రూ.21వేల కోట్లతో రుణమాఫీని చేసినట్లు పేర్కొన్నారు. పేదలకు ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.175 కోట్లతో 3,500 ఇళ్లను మంజూరు చేసిందని, త్వరలో కేటాయింపులు జరుగుతాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు–రంగారెడ్డిని రెండేళ్లలో పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరిస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. త్వరలో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని, కోర్టును ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజలు రైల్వే గేటుకు అటు ఇటు తిరగడానికి సబ్‌వేను మంజూరు చేశారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడానికి అందరూ సమష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో నాయకులు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, ప్రశాంత్, గోవర్దన్‌రెడ్డి, భారతమ్మ, నాగిరెడ్డి, శెట్టి శేఖర్, సురేందర్‌రెడ్డి, ఫారూఖ్, బాలస్వామి, కోనరాజశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక క్రీడల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment