‘సంపూర్ణ అభియాన్’తో మహర్దశ
నర్వ: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి బాట పట్టించేందుకు నీతి ఆయోగ్ జూలై 4, 2022న సంపూర్ణ అభియాన్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో 500 వెనకబడిన మండలాలను గుర్తించగా.. అందులో నర్వకు చోటుదక్కింది. ఈ క్రమంలోనే మండల సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఆరోగ్యం, పోషణ, విద్య, నీటి వసతి, పారిశుద్ధ్యం, వ్యవసాయం వంటి ఆరు ముఖ్యమైన సూచికలపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించబడిన నర్వ మండలాన్ని సంపూర్ణ అభియాన్ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సంస్థ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మండలంలో ఇప్పటి వరకు జరిగిన, చేపట్టిన పనుల రివ్యూ కోసం గురువారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రానున్నారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
నీతి ఆయోగ్ కార్యక్రమంలో భాగంగా రాయికోడ్ గ్రామాన్ని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్న నేపథ్యంలో డీఎస్పీ లింగయ్య భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పరిశీలించనున్న అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ కార్యాలయం, పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు.
ఉమ్మడి జిల్లాలో
వెనకబడిన ప్రాంతంగా నర్వ ఎంపిక
నీతి ఆయోగ్ ద్వారా అభివృద్ధికి చేయూత
ఆరోగ్యం, పోషణ, విద్య,
మౌలిక వసతుల కల్పన
Comments
Please login to add a commentAdd a comment