పీజీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నాగర్‌కర్నూల్‌లో పీజీ సెంటర్ ఏర్పాటుకు పీయూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఎంపీ డా.మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాగర్‌కర్నూల్‌లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 28వ తేదీన ఉమ్మడి జిల్లా సీనియర్ పురుషుల, మహిళా ఖోఖో జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఒబేదుల్లా కొత్వాల్, జీఏ.విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని, మిగ తా వివరాల కోసం రాజు ((99850 23847), పురంచంద్ (99513 13615), మోహన్‌లాల్ (99125 24385), ప్రసాద్ (94409 48072) లను సంప్రదించాలని కోరారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాణించాలని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ ఉషూ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లాకేంద్రంలోని టీజేఎంఆర్‌జేసీ–3 బాలుర విద్యార్థులు ఎండీ ఆసిఫ్, రాఘవేందర్, సాయి సూర్యకుమార్, జస్వంత్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం మెయిన్ స్టేడియంలో విద్యార్థులను డీవైఎస్‌ఓ శ్రీనివాస్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అబ్దుల్ సమీ, వ్యాయామ ఉపాధ్యాయుడు గులాం అఫ్రోజ్ పాల్గొన్నారు.
యువకులు ధర్మ
రక్షకులుగా పనిచేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: విశ్వహిందూ పరిషత్‌లో ధర్మ రక్షకులుగా పనిచేయడానికి యువకులు ముందుకు రావాలని పరిషత్ ప్రాంత కార్యకారిణి చింతల వెంకన్న అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం వీహెచ్‌పీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి గ్రామంలో దేవాలయాలను కేంద్రంగా చేసుకొని సత్సంగాలు నిర్వహించే విధంగా కార్యకర్తలను తయారు చేయాలన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏడు ఉత్సవాలు నిర్వహించాలన్నారు. రామోత్సవాలు, పరిషత్‌స్థాపన దివాస్, దుర్గాష్టమి, గోపాష్టమి, ధర్మరక్షణ దివాస్, శౌర్యదివాస్, సామాజిర సమరసత దివాస్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాలు జరిగినప్పుడే అక్కడ వీహెచ్‌పీ పటిష్టంగా ఉందని భావించవచ్చని అన్నారు. అనంతరం గోరఖ్‌పూర్ గీత ప్రెస్ రూపొందించిన 2025 నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించి కార్యకర్తలకు అందజేశారు. సమావేశంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి, విభాగ్ కార్యదర్శి అద్దని నరేంద్ర, సత్సంగ సంయోజక రాచాల జనార్దన్, జిల్లా కార్యదర్శి నలిగేశి లక్ష్మినారాయణ, సభ్యులు బుట్ట శ్రీనివాస్, శ్రీధర్‌బాబు, హేమలత, రాజేంద్రమణి, రఘునాథ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రెబ్బ విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment