స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టులదే కీలకపాత్ర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సీపీఐ పార్టీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో చేసిన పోరాటం అయోఘ మైనదని, కమ్యూనిస్టులదే కీలకపాత్ర అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు నరేందర్‌రెడ్డి అన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో నిర్బంధాలు, అణచివేతలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటలో సంబంధం లేని వ్యక్తులు హిందుత్వ ఎజెండాతో మత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పేద వర్గాల కోసం కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు చేసిందని, పార్టీ ఆవిర్భవించి వందేళ్లు అవుతుందన్నారు. శ్రామిక, రైతు, కార్మిక, విద్యార్థి, యువజన పక్షాన నేటికి నిలబడి పోరాటం చేస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ మాట్లాడుతూ ఆనాటి కమ్యూనిస్టు వీర యోధుల వారసులుగా పార్టీ శ్రేణులు జిల్లాలో విస్తరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్‌గౌడ్, నాయకులు కృష్ణయాదవ్, రాజు, నరసింహ, పద్మావతి, సత్యనారాయణరెడ్డి, బాషా, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సీపీఐ శత వార్షికోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment