లక్ష్య ఛేదనలో..
చదువులో రాణించేందుకు..
గత సంవత్సరంలో కూడా ఎక్కువ మార్కులు సాధించేందుకు ఎంతో కృషి చేశా. ప్రస్తుత 2025 సంవత్సరంలో చదువులో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటా. అందుకనుగుణంగా టైం టేబుల్‌తో పాటు వినూత్న పద్ధతిలో చదివేందుకు ఈ సంవత్సరం మార్పులు చేసుకుంటా. భవిష్యత్‌లో మంచి ర్యాంకులు సాధించి జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తా. – శ్రీనిజ
ఐఏఎస్ లక్ష్యం..
చదువులో అన్ని సబ్జెక్టుల్లో బాగానే రాణిస్తున్నా. వచ్చే సంవత్సరంలో చదువులో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు, సందేహాల నివృత్తికి తీసుకోవాల్సిన మార్పులపై కృషి చేస్తా. ఐఏఎస్ కావాలన్న లక్ష్యం కోసం చాలా శ్రమిస్తా. అందుకోసం సమయం వృథా చేయకుండా చదువులపై దృష్టిపెట్టేలా మార్పులు చేసుకుంటూ 2025 సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకుంటాను. – రూపిక
టీవీ, ఫోన్‌కు దూరంగా..
చదువులో వెనుకబడకుండా ఉండాలంటే తప్పకుండా టీవీ, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిదని తెలిసింది. ఈ పరీక్షలు పూర్తయ్యే వరకు వాటికి దూరంగా ఉండేందుకు ఈ సంవత్సరం నుంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా. చాలా సమయం పుస్తకాలతో గడపడం వల్ల పరీక్షల్లో రాణిస్తానని, మంచి మార్కులు సాధిస్తానన్న నమ్మకం ఉంది. – వైశాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు 2025 సంవత్సరంలో మార్పులు చేసుకుంటామని, రోజువారి జీవన విధానం, అలవాట్లలో కూడా మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేయనున్నట్లు ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు పేర్కొన్నారు. ఈ మేరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘కొత్త సంవత్సరం.. కొత్త లక్ష్యాలు’ పేరుతో మంగళవారం నిర్వహించిన డిబేట్‌లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టాల్సిన మార్పులపై విస్తృతమైన చర్చ జరిపారు. గత 2024 సంవత్సర స్మృతులు నెమరేసుకుంటూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
ఆలోచనల్లో మార్పులు..
చదువులో ముందు రాణిస్తామనే మంచి ధోరణితోనే లక్ష్యం వైపు అడుగులు వేస్తా. 2025 సంవత్సరంలో కూడా తక్కువ మార్కులు వస్తాయన్న ఆలోచన లేకుండా పూర్తిస్థాయిలో మన తోటి వారికి కూడా పోటీగా చదవాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తా. మార్కులు సాధించేందుకు కావాల్సిన కొత్త విషయాలను అధ్యాపకుల ద్వారా తెలుసుకుంటే సులభంగా వచ్చే సంవత్సరం లక్ష్యాన్ని చేరుకోవచ్చు. – సాయిసుధ
చాలెంజ్‌గా తీసుకుని..
2025 సంవత్సరం నా జీవితంలో ఎంతో కీలకమైంది. అందుకోసం పూర్తిగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా మార్పులు చేసుకుంటా. ఎక్కువ సమయం చదువుపై దృష్టిపెట్టి.. సమయం వృథా కాకుండా జాగ్రత్త పడతాను. ప్రతి సంవత్సరం ప్రతిఒక్కరి జీవితంలో కీలకమైందే. కానీ, ప్రతి సంవత్సరాన్ని చాలెంజ్‌గా తీసుకుని లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలి.
– తమీమా ఫాతిమా
కొత్త అంశాలపై దృష్టిపెడతాం
‘సాక్షి’ డిబేట్‌లో విద్యార్థుల మనోగతం
Comments
Please login to add a commentAdd a comment