జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని కలెక్టర్ విజయేందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరం ప్రక్రియ అని, చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామన్నారు. ఇందులో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖా స్తులను కూడా పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర ప్ర భుత్వం ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతుందని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. ప్రజాపాలన కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజాపాలన సదస్సులో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఈ నెల 26 ప్రారంభించే నాలుగు పథకాలపై మంగళవారం నుంచి ప్రారంభమయ్యే గ్రామసభల్లో ప్రజాభిప్రాయలు తీసుకోవడంతోపాటు గ్రామసభలు, ప్రజా పాలనలో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంపీడీఓ కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను తగు రీతిలో పరిశీలించిన తర్వాతే అర్హుల తుది జాబితా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
● వ్యవసాయ యోగ్యమైన ప్రతి భూమికి రైతు భరోసా కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఉపాధి హామీలో కనీసం 20 రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేస్తామన్నారు. ప్రతి కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తామన్నారు. ఇటీవల మున్సిపాలిటీలో కలిసిన గ్రామాల్లో 2023– 24లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలో తీసుకుంటామని చెప్పారు. గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment