సర్వే చేసినా.. పారితోషికం రాలే
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయించింది, పారితోషికం ఇవ్వడం మరిచారు. సర్వే చేసిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇంకా పారితోషకం ఇప్పటి దాక అందలేదు. సర్వే ప్రారంభానికి ముందే ప్రభుత్వం జిల్లాకు రూ.2,19,14,000 నిధులు మంజూరు చేసింది. సర్వే ప్రక్రియ ముగిసి నెల గడిచినా నేటికీ పారితోషకాలు చెల్లించ కపోవడంతో వారికి నిరీక్షణ తప్పడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుల సమగ్ర ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. మున్సిపాల్టీల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్, సీని యర్ అసిస్టెంట్లు, మెప్మా రీసోర్స్ పర్సన్లు, సీవోల ను ఎన్యూమరేటర్లుగా నియమించారు. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఎంఆర్ సీ సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా నియమించారు. వీరంతా నవంబర్ నెల 9నుంచి 24వ తేదీ వరకు తమకు కేటాయించిన సంఖ్యకు అనుగుణంగా ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. ఆయా కుటుంబాల సమాచారాన్ని ప్రత్యేక ఫాంలో నమోదు చేశారు. ఈ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మండల స్థాయి అధికారులను సూపర్‌వైజర్లుగా నియమించారు. ఎన్యూమరేటర్లు చేసిన సర్వే ఫాంలను పరిశీలించి రోజు వారీగా జరిగిన సర్వే వివరాలను సూపర్‌వైజర్లు ఉన్నతాధికారులకు నివేదించారు. సర్వే వివరాలను వెబ్‌సైట్లో నమోదు చేసేం దుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.
పెండింగ్‌లో
పారితోషికం..
సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్‌కు రూ.10 వేలు, సూపర్‌వైజరుకు రూ.12వేల చొప్పున, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారం నమోదుకు రూ.25 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వే ప్రారంభానికి మందే ప్రభుత్వం జిల్లాకు రూ.2,19,14 మంజూరు చేసింది. సర్వే ఫాంల ముద్రణ నుంచి పారితోషికాల చెల్లింపు వరకు ఈ నిధులు వినియోగించాలని సూచించింది. అయితే సర్వేతో పాటు డాటా ఎంట్రీ ప్రక్రియ ముగిసి నెల దాటినా జిల్లాలో వాటి చెల్లింపులు జరగలేదు. దీంతో తమకు పారితోషికాలు ఎప్పుడు అందుతాయా.. అని ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వాటిని త్వరగా చెల్లించేలా చూడాలని ఉన్న తాధికారులను వారు కోరుతున్నారు.
జిల్లాకు రూ.2.19 కోట్లు మంజూరు
నెల దాటినా చెల్లించని వైనం
నిరీక్షిస్తున్న సర్వే సిబ్బంది
బిల్లులు చేయడం జరిగింది..
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఇవ్వాల్సిన పారితోషికం బిల్లులను పూర్తి చేయడం జరిగింది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల పారితోషికాలతో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ల పారితోషికం బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరూ ఎలాంటి భయం పెట్టుకోవద్దు. – రవీందర్, సీపీఓ
Comments
Please login to add a commentAdd a comment