మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటారు. ఈ పోటీల్లో క్రీడాకారులు 33 పతకాలు సాధించి సత్తాచాటారు. 11 బంగారు, 13 రజతం, 9 కాంస్య పతకాలు గెలుపొందారు. క్రీడాకారులను మహబూబ్‌నగర్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌గౌడ్, పరశురాములు అభినందించారు.
పతకాల వివరాలు
జగదీశ్వర్ 40+ఏళ్ల విభాగంలో 100 మీ.,లో కాంస్యం, రాములు 45+ ట్రిపుల్ జంప్‌లో కాంస్యం, స్వాములు 45+ ఏళ్ల విభాగం డిస్కస్‌త్రోలో రజతం, షాట్‌ఫుట్, జావెలిన్‌త్రోలో బంగారు పతకం సాధించారు. దేవదానం 75+ ఏళ్ల విభాగం 5 కేఎం వాక్ రజతం, షాట్‌ఫుట్‌లో బంగారు, 100 మీటర్ల పరుగులో రజతం, గౌరీశంకర్ 55+లో 5 కేఎం వాక్ రజతం, సీతమ్మ 40+ఏళ్ల విభాగంలో జావెలిన్‌త్రోలో బంగారు, షాట్‌ఫుట్‌లో, డిస్కస్‌త్రోలో రజతం, విక్టర్‌పాల్ 60+లో హైజంప్, డిస్కస్‌త్రోలో బంగారు, వనజారెడ్డి 45+ 800 మీటర్ల పరుగులో, ట్రిపుల్, లాంగ్‌జంప్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఖాజామోయినుద్దీన్ 50+ ఏళ్ల విభాగంలో షాట్‌ఫుట్‌లో రజతం లాంగ్‌జంప్, 100మీటర్ల పరుగులో కాంస్యం, సత్యం 45+ఏళ్ల విభాగం డిస్కస్‌త్రోలో బంగారు, షాట్‌ఫుట్‌లో రజతం, జ్యోతి 35+ ఏళ్ల విభాగంలో జావెలిన్‌త్రోలో బంగారు, షాట్‌ఫుట్‌లో కాంస్యం, వెంకటయ్య 70+ఏళ్ల విభాగం 5కేఎంవాక్, 200మీటర్ల పరుగులో రజతం పతకం దక్కించుకున్నారు. 100 మీ.,లో కాంస్యం, మన్యమయ్య 45+ఏళ్ల విభాగం 5 కేఎం వాక్‌లో రజతం, 400 మీటర్ల పరుగులో కాంస్యం, ఆంజనేయులు 60+ఏళ్ల విభాగం హ్యామర్‌త్రోలో రజతం, షాట్‌పుట్‌లో కాంస్యం, కృష్ణయ్య 60+ ఏళ్ల విభాగం 200 మీటర్లు, 100 మీటర్ల పరుగులో రజతం, లాంగ్‌జంప్‌లో కాంస్య పతకాలు సాధించారు.
33 పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు
Comments
Please login to add a commentAdd a comment