ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి
దేవరకద్ర/ చిన్నచింతకుంట: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అధికారులను కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి, దేవరకద్ర మండలంలోని హజిలాపూర్‌లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను వేగవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సర్వే చేస్తున్న విధానాన్ని, ఇందిరమ్మ యాప్‌లో లబ్ధిదారుల వివరాలను ఏవిధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడి ఇంటికి సర్వే బృందం తప్పనిసరిగా వెళ్లి అక్కడి పరిస్థితిని గమనించి వివరాలు సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ అనిల్, ఆర్‌ఐ శరత్, పంచాయతీ కార్యదర్శి మమత, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి
Comments
Please login to add a commentAdd a comment