– వివరాలు 8లో..
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా.. ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ విజయేందిర ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో అంశంపై ఒక్క అఽధికారిని నియమించి పర్యవేక్షించేలా బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినా.. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 441 గ్రామ పంచాయతీల్లో 3,836 వార్డులు ఉన్నాయి. వార్డులతో పాటు ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 650 కంటే ఎక్కువగా ఓటర్లు ఉంటే అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా.. జిల్లా 5,27,302 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా.. ఇందులో 2,62,558 మంది పురుషులు, 2,64,736 మంది మహిళలు, ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment