మహబూబ్‌నగర్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా మొత్తం రూ.25,06,91,000 రావాలి. అయితే 258 షాపులకు గాను 20 ఖాళీగా ఉన్నాయి. అలాగే 2020 నుంచి కరోనా సమయంలో వ్యాపారం సరిగా నడవక నష్టపోయిన వారు, అప్పట్లో పోటాపోటీగా ఎక్కువ అద్దెకు పాట పాడి తీసుకోవడంతో ప్రస్తుతం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ సుమారు 60 మంది దుకాణ దారులు తెరవకుండా సొంతంగా తాళం వేసుకున్నారు. ఇలాంటి వాటి నుంచి రూ.8,24,36,000 అద్దె బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఈ ఏడాది వాస్తవంగా రూ.16,82,55,000 డిమాండ్‌కు గాను ఇప్పటివరకు కేవలం రూ.1,23,86,000 మాత్రమే (7.36 శాతం) వసూలైంది. జడ్చర్ల పట్టణంలో ఐడీఎస్‌ఎంటీ కింద అప్పట్లో 41 దుకాణాలు నిర్మించారు. వీటిలో 11 దుకాణాలను వివిధ వ్యాపారాలు నిర్వహించేందుకు, 30 షాపులు కేవలం కూరగాయల క్రయవిక్రయాల కోసం ఇచ్చారు. వీటి నుంచి మొత్తం రూ.11,91,000 రావాలి. అయితే ఏడాది కాలంగా సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటు కారణంగా ఈ షాపులను సరిగా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. గిరాకీలు ఏ మాత్రం లేకపోవడంతో చాలా మంది వర్తకులు వీటిని అప్పుడప్పుడు తెరుస్తున్నారు. ఇలాంటి వాటి నుంచి రూ.57 వేల పాత బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది వాస్తవంగా రూ.11.34 లక్షలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.7.14లక్షలు (59.94 శాతం) వచ్చింది.
గడువులోగా వసూలు చేస్తాం
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. దుకాణాల అద్దె, నల్లా బిల్లులను గడువులోగా వీలైనంత ఎక్కువ వసూలయ్యేలా చూస్తాం. వాస్తవానికి గత రెండు మూడు నెలలుగా రెవెన్యూ సిబ్బందికి వేరే విధులు కేటాయించాల్సి వచ్చింది. వారు ఎక్కువగా ఎల్‌ఆర్‌ఎస్, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో నిమగ్నం కావడంతో ఈ వసూళ్లపై ప్రభావం పడింది. – డి.మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment