వనపర్తి రూరల్: పట్టణంలోని కేడీఆర్‌నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కేడీఆర్ కాలనీకి చెందిన మనోహర్‌రావు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 18న హైదరాబాద్‌కు వెళ్లాడు. సోమవారం వనపర్తికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో దాచిన రూ.75 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment