అరకొరగానే..
మహబూబ్‌నగర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు అర్హుల ఎంపికలో అంతా గందరగోళంగా మారింది. దరఖాస్తు చేసుకున్నా పేర్లు లేకపోవడంతో నిజమైన అర్హులు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించడంతో ప్రజలు సంతోషపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వేలో 360 డిగ్రీల్లో పరిశీలన చేశామని, అర్హుల జాబితా రూపొందించామని ప్రభుత్వం చెబుతున్నా.. చాలామంది పేర్లు జాబితాలో లేవు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం సమగ్ర ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని వారి వివరాలను సేకరించారు. కాగా గతేడాది ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకున్న సమయంలో ప్రజలు రేషన్‌కార్డుల కోసం విడిగా దరఖాస్తు ఇచ్చారు. ఇవి సుమారు 55 వేలకు పైగా ఉంటాయని అంచనా. ప్రభుత్వం మాత్రం 14,965 మందితో జాబితా విడుదల చేసింది. తిరిగి దరఖాస్తులు తీసుకోవాలని, ప్రజాపాలన సమయంలో ఇచ్చిన వాటిని పరిగణలోకి తీసుకొని విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో రేషన్‌కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వే సోమవారం ముగిసింది.
అర్హులకు నిరాశే..
రేషన్‌కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు నిరాశే ఎదురైంది. గత ప్రభుత్వ హయాంలోనూ రేషన్‌కార్డులకు నోచుకోని వారు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ, కార్డుల జారీలో పరిస్థితులు గందరగోళంగా మారడంతో ఆశలు వదులుకుంటున్నారు. వేలల్లో దరఖాస్తులు ఉంటే వందల్లో రేషన్‌కార్డులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో గ్రామంలో వందకు పైగా రేషన్ కార్డులు అవసరం ఉండగా.. 5 నుంచి 10 మాత్రమే జారీ చేస్తున్నారు.
● ఇదిలా ఉండగా.. పాత కార్డుల్లో తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని 18,001 దరఖాస్తులు వచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల పేర్లు కూడా ప్రభుత్వం పంపిన జాబితాలో కనిపించకపోవడంతో వారు లబోదిబోమంటున్నారు.
ఇవీ నిబంధనలు
పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులకు ఏడాది వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వారికి ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉంటే అర్హతగా తేల్చారు. తరి 3.5 ఎకరాలు, మెట్ట భూమి 7 ఎకరాల వరకు ఉండవచ్చని నిబంధన విధించారు.
19,016
201
ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కానరాని అర్హుల పేర్లు
ప్రజాపాలనలో 55 వేలకుపైగాదరఖాస్తులు
తాజాగా 14,965 మందితోనే అర్హుల జాబితా విడుదల
తెల్ల రేషన్‌కార్డులపైదరఖాస్తులదారుల గగ్గోలు
గ్రామసభల్లో మరోసారి
దరఖాస్తులకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment