పథకాలు వస్తలేవు..
రేషన్‌కార్డు కోసం కులగణన సర్వేకు అధికారులతో వివరాలు రాయించాం. పరిశీలనకు వచ్చిన వారి వద్ద ఉన్న జాబితాలో మా పేర్లు లేవు. ఈ విషయమై అధికారులను అడిగితే గ్రామసభలో దరఖాస్తు ఇవ్వాలని చెబుతున్నారు. నాకు పెళ్లి నాలుగేళ్ల క్రితం అయ్యింది. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. రేషన్‌కార్డు లేక బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు రావడం లేదు.
– వెంకటేష్, మాచన్‌పల్లి గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్
దరఖాస్తు చేసుకున్నా..
నాకు వివాహమై ఆరే ళ్లు కాగా.. ఇద్దరు పిల్ల లు ఉన్నారు. కానీ తమ కుటుంబానికి నే టికీ రేషన్‌కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. కులగణన సర్వే కోసం వచ్చిన సిబ్బందికి రేషన్‌కార్డు లేదని చెప్పినా.. జాబితాలో నా పేరు లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మాకు అధికారులు స్పందించి రేషన్‌కార్డు జారీ చేయాలి.
– శ్రీనునాయక్, ఓబ్లాయిపల్లి తండా, మహబూబ్‌నగర్ రూరల్
●
అర్హులందరికీ అందిస్తాం..
కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం నిర్వహిస్తున్న సర్వే పారదర్శకంగా పూర్తయింది. అర్హులకు కార్డులు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రజాపాలనలో తమకు అందిన దరఖాస్తుల పరిశీలనను తొలి విడతగా చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. అర్హులై ఉండి జాబితాలో పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే మంగళవారం నుంచి శుక్రవారం జరిగే గ్రామ, వార్డుసభల్లో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. – వెంకటేష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment