● మహబూబ్‌నగర్ జిల్లాలో 132 మంది బదిలీకి అవకాశం
● నేడు ఆర్డర్స్ ఇవ్వనున్న అధికారులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగుల విభజన చేసేందుకు ప్రభుత్వం 2021లో జీఓ 317 ద్వారా ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలోని పలు జిల్లాలకు బదిలీలు చేశారు. ఈ క్రమంలో స్పౌజ్ (భార్యాభర్తలు) ఒకచోటి నుంచి మరో చోటికి బదిలీ కావడంతో ఇబ్బంది మొదలైంది. ఈ క్రమంలో మొదట రాష్ట్రవ్యాప్తంగా బదిలీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చినా 13 జిల్లాలకు బదిలీ ప్రక్రియను నిలిపివేయగా అందులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 5 జిల్లాలు సైతం ఉన్నాయి. దీంతో బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం బదిలీలు చేయాలని ఉపాధ్యాయులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో స్పందించిన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి, ఇబ్బందులు ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వివిధ స్థాయిలో పరిశీలన అనంతరం జిల్లాలకు స్పౌజ్ బదిలీలు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 132 మంది బదిలీకి అవకాశం కల్పించింది. ఈ క్రమంలో బదిలీ అయ్యే వారికి అధికారులు మంగళవారం ఆర్డర్లు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే బదిలీల కోసం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చి.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేసినట్లు పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంబాబు, రమాకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ప్రజావాణికి 85 అర్జీలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో వారికి తగు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో వివిధ సమస్యలపై 85 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు పాల్గొన్నారు.
మొదటిరోజు 12 వార్డులలో సభలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు వార్డు సభలు నిర్వహించనున్నామని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. మొదటిరోజు మంగళవారం 12 వార్డులలో ఇవి కొనసాగుతాయని, అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వార్డు నం.1, 3 పరిధిలోని తిమ్మసానిపల్లి, అప్పన్నపల్లి రెవెన్యూ కార్యాలయాల వద్ద, నం.8లోని టీచర్స్‌కాలనీ వాటర్ ట్యాంకు, నం.12లోని హనుమాన్‌పురాలో కమ్యూనిటీ హాల్ – ఉర్దూ మీడియం స్కూల్, 16లోని బోయపల్లి రెవెన్యూ వార్డు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తామన్నారు. అలాగే వార్డు నం.21 పరిధిలోని కిరణ్ కాన్వెంట్ స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, 22లోని భగీరథకాలనీ కమ్యూనిటీ హాల్‌లో, 24లోని రామయ్యబౌలి అర్బన్‌హెల్త్ సెంటర్ పక్కన, 26లోని హబీబ్ నగర్ అక్బర్ మసీదు చౌరస్తా – ఎంజీ కన్వెన్షన్ హాల్‌లో, 43లోని రాంనగర్‌లో సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణం, 45లోని పాతతోట కమాన్ వద్ద నిర్మిస్తున్న భవనంలో, 48లోని క్రిస్టియన్‌కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఈ సభలు నిర్వహిస్తామన్నారు. పేదలు ఆయా ప్రాంతాలకు వచ్చి కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2025– 26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవే శానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జి ల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి సో మవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 10 మైనార్టీ పాఠశాలల్లో 5వ తరగతిలో మొత్తం సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన మైనార్టీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 10 కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈ సీ, ఎంఎల్‌టీ, సీఎస్, ఏటీ సీజీటీ (జనరల్, ఒకేషనల్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎలాంటి రుసుం లేకుండా ఆన్‌లైన్ లో https://tgmreistelangana.cgg. gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఫ్‌లైన్‌లో ఆయా పాఠశాలలు లేదా కళాశాలల ప్రి న్సిపాళ్లకు వచ్చే నెల 28లోగా దనఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం మైనార్టీ సంక్షేమ కార్యాలయం, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతోపాటు సెల్ నంబర్లు 73311 70874, 73311 70828, 73311 70830, 79950 57894 సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment