అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మానవపాడు: అప్పులబాధతో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన మానవపాడు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మానవపాడుకు చెందిన రైతు చంద్రశేఖర్‌రెడ్డి (32) తనకున్న ఆరెకరాల పొలంలో పొగాకు, కందిపంట సాగుచేశారు. పంట పెట్టుబడి, కుటుంబ అవసరాల నిమిత్తం రూ. 6లక్షల దాక అప్పులు చేశారు. అయితే చేసిన అప్పులు తీర్చే దారి లేకపోవడం, వడ్డీ భారం ఎక్కువ కావడంతో మనస్థాపానికి గురై వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం మానవపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అలంపూర్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడికి భార్య హారిక, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment