సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి రిమాండ్
కోస్గి రూరల్: సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీని, పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో వ్యక్తిని పట్టుకొని రిమాండ్ తరలించినట్లు సీఐ దస్రునాయక్ తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని సర్జఖాన్‌పేటకి చెందిన కృష్ణయ్యగౌడ్ ఈనెల 9న హైదరాబాద్‌లో సీఎం, కాంగ్రెస్ పార్టీ, పోలీస్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. సర్జఖాన్‌పేట్ మాజీ సర్పంచ్ హరీష్‌గౌడ్ గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలో ఈనెల 11న కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ బాల్‌రాజ్, పోలీసులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment