గత విద్యాసంవత్సరంలో ప్రభుత్వం కళాశాలలకు అనుమతులు ఇచ్చింది. గతేడాది కళాశాలలో చేరి రెండో సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు సమస్యగా మారింది. ప్రభుత్వం వీరు చేరిన కళాశాలలకు గుర్తింపునివ్వకపోవడంతో పరీక్ష ఫీజులు తీసుకోలేదు. ఇటీవలే పరీక్ష ఫీజు గడువును ఈ నెల 25కు పొడిగించింది. సాధారణంగా పరీక్ష ఫీజు రూ.750 ఉండగా.. జరిమానా రూ.2,500 కలిపి చెల్లించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సాధారణ ఫీజు విద్యార్థులు చెల్లించాని జరిమానా ఎవరు చెల్లించాలనేది ప్రశ్నగా మారింది. వీటితో పాటు ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులు సాధారణంగా రూ.200 చెల్లించాల్సి ఉంది. కానీ రూ.500 ఒక్కో విద్యార్థికి చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment