మరికల్: ఆర్టీసీ బస్టాండ్‌లో ఓప్రయాణికుడి జేబులో ఉన్న రూ. లక్ష నగదును చోరీచేసిన ఘటన మరికల్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వి వరాల మేరకు.. నర్వ మండలం మథన్‌కోడ్‌కి చెందిన రామచందర్ బంధువుల వద్ద చేసిన అప్పును తీర్చడం కోసం ఇంటి నుంచి రూ. లక్ష నగదు తీసుకొని ఆటోలో మరికల్ బస్టాండ్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి కొల్లంపల్లిలో ఉన్న బంధువుల వద్దకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో అతడి జేబులో ఉన్న డబ్బులను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment