జాతీయ వైద్యబృందం పరిశీలన
కల్వకుర్తి టౌన్: పట్టణంలోని సీహెచ్‌సీని జాతీయ జనాభా పరిశోధన కేంద్ర బృందం తనిఖీ చేశారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకున్న తమిళనాడుకు చెందిన వైద్యులు కవిత, శక్తి మాళవిక బృందం రాత్రి వరకు రోగులకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో డెలివరీ తర్వాత ఇచ్చే జీరో డోస్, మాతా, శిశు మరణాల రేటు, వచ్చే రోగులకు సరిపడా సిబ్బంది వివరాల, బ్లడ్‌బ్యాంకులో ఉన్న రక్తనిల్వలపై వివరాలను ఆరాతీశారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను వారు నిశితంగా పరిశీలించారు. కేంద్ర బృందం వెంట డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు యశోదబాయి, విష్ణు, శివ, స్వప్న, నర్సింగ్ సూపరింటెండెంట్ శిరోమణి, నర్సింగ్ సిబ్బంది జాయ్‌మెర్సీ, బాలమణి, సునీత, సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె దవాఖానా తనిఖీ..
వెల్దండ: మండలంలోని కొట్ర గ్రామంలో పల్లె దవాఖానాను సోమవారం కేంద్ర వైద్య బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈసందర్భంగా ఆస్పత్రిలోని వైద్యసేవల పనితీరు, అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పల్లె దవాఖానాల ద్వారా గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నట్లు ఆబృందం సభ్యులు పేర్నొన్నారు. అనంతరం కేంద్ర వైద్య బృందానికి ఇక్కడి సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్, డాక్టర్లు మంజుభార్గవి, నవీన్‌కుమార్, సూపర్‌వైజర్లు మురళీకృష్ణ, సుమిత్ర, కవిత, ఎఎన్‌ఎంలు జాహంగీర్‌బీ, జానకి, ఎల్లమ్మ, ఫార్మసిస్టు అనిత, ఆశావర్కర్లు మంగమ్మ, లక్ష్మీబాయి, రాణిబాయి, శ్రీదేవి, పద్మ, సాయమ్మ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment