గద్వాల క్రైం: మండలంలోని ఓ రైస్ మిల్లులో గద్వాల పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. మిల్లులో అనుమానాస్పదంగా ఉన్న పీడీఎస్ బియ్యం లారీని గుర్తించిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ శ్రీను కథనం ప్రకారం.. మండలంలోని ఓ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించరన్నారు. ఓ లా రీలో రీసైక్లింగ్ చేసిన బియ్యం తరలిస్తున్నట్లు అనుమా నం మేరకు సదరు లారీని అదుపులోకి తీసుకుని సివిల్ సప్‌లై శాఖ అధికారులకు అప్పగించారు. ఆ శాఖ అధికారులు పరిశీలించి పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ చేసినట్లు ధృవీకరిస్తే చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
● ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల నుంచి సంబంధిత రైస్‌మిల్లు యజమానికి ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఆరుబయటే నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో వెల్లడైందని తెలుస్తుంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో నడిగడ్డలో నిత్యం వందలాది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీలో పట్టుబడిన సమయంలో మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు.
పీడీఎస్ బియ్యం లారీ పట్టివేత
సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగింత
విచారణ జరుపుతాం..
పట్టుబడిన బియ్యం లారీని గద్వాల పోలీసులు మా దృష్టికి తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం గద్వాల మార్కెట్ యార్డ్‌లోని స్టాక్ పాయింట్ వద్దకు తరలించారు. పట్టుబడిన బియ్యం పీడీఎస్ లేదా రీసైక్లింగ్ చేసిన బియ్యం అనే విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – మహర్షి, సివిల్ సప్లయ్ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment