మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి నిరసన
భూత్పూర్: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న సురేందర్‌రెడ్డి మూడు నెలల కిందట బదిలీ కాగా జడ్చర్ల మున్సిపల్ కమిషనర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదని, మున్సిపాలిటీలో సమస్యలు పేరుకుపోతున్నా కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. వీధిలైట్లు, పారిశుద్ధ్య సమస్య వేధిస్తుండటంతోపాటు ట్రాక్టర్ మరమ్మతుకు గురైనా బాగు చేయించడం లేదని ఆరోపించారు. దీంతో మొక్కలకు నీళ్లు పోయడం లేదని, పార్కు ఎండిపోతోందని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్ మేనేజర్ శంకర్‌నాయక్‌తో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, జాకీర్, మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, యాదయ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment