జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం వేరుశనగ దిగుబడులు పోటెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి 6,614 క్వింటాళ్ల వేరుశనగ యార్డుకు విక్రయానికి వచ్చింది. వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.6,569, కనిష్టంగా రూ.4,029 ధరలు వచ్చాయి. అలాగే కందులు క్వింటాలు గరిష్టంగా రూ.7,159, కనిష్టంగా రూ.5,800, మొక్కజొన్న క్వింటాల్ సరాసరిగా రూ.2,431, పెబ్బర్లు క్వింటాల్ సరాసరిగా రూ.6,683, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,590, కనిష్టంగా రూ.2,409, జొన్నలు క్వింటాల్ ఒకే ధర రూ.4,143 చొప్పున కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment