రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభచూపాలి
మహబూబ్‌నగర్ క్రైం: ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు కరీంనగర్‌లో జరిగే 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై న పోలీస్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పరేడ్ మైదానంలో సోమవారం స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికై న వారితో డీఐజీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రస్థాయితోపాటు జాతీయ స్థాయిలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకునేందుకు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. జోగుళాంబ జోన్ గర్వపడే విధంగా క్రీడల్లో ప్రతిభ చూపాలని కోరారు. పోలీస్ శాఖ అంటే చట్టాన్ని అమలు చేయడంతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, నారాయణపేట ఏఆర్ ఏఎస్పీ రియాజ్ ఉల్‌హక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment