ఈసారైనా నిర్మించాలి..
గతంలో రెండు పర్యాయాలు బీటీ రోడ్డు మంజూరైనా నిర్మించలేదు. నవాబ్‌పేటకు వెళ్లే మెయిన్ రోడ్డు ఫతేపూర్ మైసమ్మ దేవస్థానం దగ్గర నుంచి గుడిమల్కాపూర్ గ్రామానికి అటవీ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఈసారి కూడా ప్రభుత్వం బీటీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడైనా రోడ్డు నిర్మించి 5 గ్రామాలకు రవాణా మార్గాన్ని మెరుగుపర్చాలి.
– బాలాగౌడ్,
మాజీ సర్పంచ్, గుడిమల్కాపూర్
ఇబ్బందులు పడుతున్నాం..
గతంలో ఒకసారి బీటీ రోడ్డు మంజూరైనా పనులు చేపట్టలేదు. ఈసారి బీటీ రోడ్డు నిర్మాణమవుతుందనే ఆశగా ఉన్నాం. మా తండాకు మట్టి రోడ్డు ఉండటంతో రాత్రిపూట రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వన్యప్రాణుల భయంతో రోడ్డు సరిగా లేక అవస్థలు పడుతున్నాం.
– ఊక్యనాయక్, కొత్తచెర్వుతండా
●
Comments
Please login to add a commentAdd a comment