వాహనాలు సిద్ధం | Sakshi
Sakshi News home page

వాహనాలు సిద్ధం

Published Tue, May 7 2024 12:15 AM

-

● ఎన్నికల సిబ్బంది, సామగ్రి రవాణాకు ఆర్టీఏ ఏర్పాట్లు ● మూడు నియోజకవర్గాల్లో సిబ్బందికి బస్సులు ● దివ్యాంగ ఓటర్ల తరలింపునకు ఆటోలు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు ఆర్టీఏ వాహనాలు సిద్ధం చేసింది. ఈ నెల 13న పోలింగ్‌ నేపథ్యంలో గ్రామ, మండల స్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సామగ్రి తరలింపునకు బస్సులు, కార్లు సమకూరుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సంతోష్‌ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ) సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. దివ్యాంగ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి తీసుకెళ్లడానికి ఆటోలు సమకూరుస్తున్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకర్గాల్లో 98రూట్లకు అనుగుణంగా అధికారులు వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 12, 13వ తేదీల్లో వాటిని వినియోగించుకుంటారు. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వర్తించే ఉన్నతాధికారుల కోసం అవసరమైన 100 కార్లను సమకూర్చారు. ఎన్నికల కోడ్‌ అమలు నుంచి ఎన్నికల పరిశీలనకు కేటాయించిన రూట్లలో కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాలో..

పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌ ఉన్నాయి. ఎన్నికల ఉద్యోగులు, సిబ్బందితోపాటు సామగ్రి తరలింపునకు 214 వాహనాలు సిద్ధం చేశారు.

● దివ్యాంగులు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. అచేతన స్థితిలో ఉన్న వృద్ధులు, ది వ్యాంగులు ఓటు వేసేందుకు ఇంటి నుంచి వ చ్చి ఓటు వేసిన తర్వాత వెళ్లడానికి ఆటోలు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటివరకు 492 ఆటోలు అవసరమని గుర్తించి సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు 150 ఆటోలు, గ్రామీణ ప్రాంతాలకు 350 ఆటోల వరకు కేటాయించి పోలింగ్‌ కేంద్రాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement