సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు
● జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు ● త్వరలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు
తేమశాతాన్ని బట్టి మద్దతు ధర (క్వింటాల్‌కు)
దండేపల్లి: మంచిర్యాల జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు, మూడు రో జుల్లో కొనుగోళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలకు అనుమతిచ్చారు. మద్ద తు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయనున్నా రు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో, కొన్నిచోట్ల కొంత మంది రైతులు తమ అవసరాల నిమిత్తం ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6వే ల నుంచి, రూ.6,200 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. కొంత మంది రైతులు మాత్రం సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించే వరకు పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభం అయితే రైతులకు కొంత ప్రయోజనం చేకూరనుంది.
ఏడు చోట్ల కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో ఖరీఫ్‌లో 1,57,630 ఎకరాల్లో రైతులు పత్తిసాగు చేశారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఏడు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలకు అనుమతి లభించింది. దండేపల్లి మండలం కన్నెపల్లి శ్రీవెంకటేశ్వర జిన్నింగ్ మిల్లు, బెల్లంపల్లిలోని రేపల్లెవాడ శ్రీరామ జిన్నింగ్, మహేశ్వరి కాటన్, చెన్నూర్ మండలంలో చెన్నూర్ పట్టణంలోని చెన్నూర్ కాటన్, ఆదివార్‌పేటలోని జీఆర్‌ఆర్ కాటన్‌మిల్, ఎల్లక్కపేటలోని ఆదిశంకరాచార్య ఇండ్రస్ట్రీస్, కోటపల్లి మండలంలోని నవదుర్గ కాటన్ మిల్‌లో పత్తికొనుగోళ్లు చేపట్టనున్నారు. పత్తిలో తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర చెల్లించనున్నారు.
తేమ లేకుండా ఆరబెట్టాలి..
సీసీఐలో పత్తి విక్రయించే రైతులు తేమ లేకుండా ఆరబెట్టి తీసుకువస్తేనే మద్దతు ధర వస్తుంది. తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర చెల్లించడం జరుగుతుంది. తేమ శాతం 12 కంటే ఎక్కువ ఉంటే సీసీఐలో కొనుగోళ్లు చేయరు. రైతులే నేరుగా తీసుకురావాలి, లేదంటే రక్తసంబంధీకులు తీసుకురావా లి. ఆధార్, పట్టాపాస్‌బుక్, బ్యాంకుఖాతా బుక్ వెంట తీసుకురావాలి.
– షహబొద్దీన్,
జిల్లా మార్కెటింగ్ అధికారి, మంచిర్యాల
తేమ శాతం ధర క్వింటాల్‌కు(రూ.లలో)
8 7,521
9 7,445.79
10 7,370.58
11 7,295.37
12 7,220.16
Comments
Please login to add a commentAdd a comment