ఎస్‌జీఎఫ్ క్రీడల్లో సత్తా
బెల్లంపల్లిరూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రీడల్లో బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల కాసిపేట విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో 21 పతకాలు సాధించారు. ఈ నెల 2న చెన్నూర్‌లో జరిగిన అండర్ 14 ,17 అథ్లెటిక్స్ బాలుర ఎంపిక పోటీల్లో పాఠశాల విద్యార్థులు 7 బంగారు, 6 సిల్వర్ ,4 కాంస్య పతకాలు సాధించారు. 8 మంది విద్యార్థులు జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 19 అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు లక్సెట్టిపేటలో నిర్వహించగా షార్ట్‌పుట్ అండర్ –19 విభాగంలో సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆదర్శ్ బంగారు పతకం, సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి నిఖిల్ సిల్వర్ మెడల్ సాధించాడు. 200 మీటర్స్ అండర్ –19 పరుగు పందెంలో సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి కె.శేఖర్ స్విలర్ మెడల్, 400 మీటర్స్ పరుగు పందెంలో సీఈసీ మొదటి సంవత్సరం విద్యార్థి తేజస్ కాంస్య పతకం గెలుచుకున్నారు. వీరిని మంగళవారం పాఠశాలలో అభినందించారు.
మంచిర్యాలఅర్బన్: ఉపాధ్యాయుల నాలుగు డీఏలు, పీఆర్సీతోపాటు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఐబీ చౌరస్తాలో ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటే ఒకటి మాత్రమే ప్రకటించటం, సమయానికి ఇవ్వాల్సిన డీఏలను కూడా పండుగల పేరుతో ఇస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని అన్నారు. ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ రుణాలకు 2 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న నేటికీ రాలేదని, సరెండర్ లీవ్ బిల్లులు మెడికల్ బిల్లులు కూడా విడుదల చేయలేదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా టీచర్ల సమస్యలు పరిష్కారించాలన్నారు. ఆనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. దీక్షకు బీజేవైఎం నాయకుడు అశ్విన్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయింపు శ్రీనివాసరావు, బగ్గని రవికుమార్, రాష్ట్ర అకడమిక్ కో–కన్వీనర విద్యాసాగర్, జిల్లా నాయకులు చీర సమ్మయ్య, నీలేశ్, భారతీ ఆశోక్, నాగరాజు, సాంబయ్య, వేణుగోపాల్‌రావు, తిరుపతి, శ్రీనివాస్, రుపాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment