కొనుగోలు కేంద్రాలతో రైతులకు భరోసా
దండేపల్లి: వరి కోతలు ఇప్పుడిప్పుడే మొదలవుతు న్న తరుణంలో, ముందస్తుగానే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు భరోసా కల్పిస్తున్నామని డీఆర్డీవో కిషన్ తెలిపారు. దండేపల్లి మండల కేంద్రంతోపాటు, మండలంలోని నాగసముద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోన్నే విక్రయించాలని సూచించారు. గ్రేడ్‌ఏ ఽరకానికి రూ.2,320, సాధారణ రకానికి 2,300, సన్నరకానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ అందించడం జరుగుతుందని వివరించారు. ధాన్యం విక్రయించే రైతులు సెంటర్ నిర్వాహకులకు పట్టాపాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్ అందించాలన్నారు. కార్యక్రమాల్లో డీపీఎం వేణుగోపాల్, ఏపీఎం బ్రహ్మయ్య, సీసీలు లావణ్య, సురేందర్, వీవోఏలు, వీవో లీడర్లు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రత్యేక అధికారి
జన్నారం: జన్నారం మండలం మొర్రిగూడ గ్రామంలో మంచిర్యాల జిల్లా స్పెషల్ అధికారి కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్డీవో కిషన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ధాన్యాన్ని పరిశీలించారు. తేమశాతం అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, డీఎం వేణు, ఐకేపీ ఏపీఎం బుచ్చయ్య ఉన్నారు.
డీఆర్డీవో కిషన్
Comments
Please login to add a commentAdd a comment