బెల్లంపల్లి: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లిలో నిర్వహించిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.7800 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐఎఫ్‌డీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు సావిత్రి, రాహుల్, శేఖర్, మహేందర్, అనిల్, క్రాంతి, ఎంసీపీఐ(యూ) నాయకులు వెంకటేష్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment