విధులకు సమాయత్తం
శిక్షణ సమాప్తం..
● నేడు పోలీస్ పాసింగ్ అవుట్‌పరేడ్ ● ముఖ్యఅతిథిగా రానున్న ఐజీ రమేశ్ ● సొంతజిల్లాలకు వెళ్తున్న 254 మంది ● జిల్లాకు 219మంది కొత్త పోలీసులు
ఆదిలాబాద్‌టౌన్: శారీరక దారుఢ్య, రాత పరీక్షల్లో విజయం సాధించిన పలువురు కానిస్టేబుల్ కొలువు సాధించారు. గత ఫిబ్రవరి 21న జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల పాటు ట్రైనింగ్ పొందారు. ఇందులో రాష్ట్రంలోని సూర్యపేట, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, సైబ రాబాద్, ములుగు జిల్లాలకు చెందిన 254 మంది ఉన్నారు. వీరి పోలీస్ పాసింగ్ అవుట్‌పరేడ్ గురువా రం నిర్వహించనుండగా ఈ సందర్భంగా వీరు నే ర్చుకున్న అంశాలను ప్రదర్శించనున్నారు. కార్యక్రమానికి ఐజీ ఎం.రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరు కా నున్నారు. కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, తె లంగాణ బెటాలియన్ కమాండెంట్ నితికపంత్‌తో కలిసి శిక్షణలో ప్రతిభ చాటిన అభ్యర్థులకు మెడల్స్ బహూకరించనున్నారు. ఆ తర్వాత వీరంతా ఆయా జిల్లాల్లో ఎస్పీకి రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు.
జిల్లాకు 219 మంది కొత్త పోలీసులు
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పోలీసులుగా విధుల్లో చేరనున్నవారిలో పురుషులు జడ్చర్ల, యూసుఫ్‌గూడ, మహిళలు హైదరాబాద్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పొందారు. జిల్లాకు 219 మంది రానుండగా, వీరిలో 94 మంది పురుషులు సివిల్, 46 మంది మహిళలు సివిల్ కానిస్టేబుళ్లున్నారు. 63 మంది పురుషులు ఏఆర్, 16 మంది మహిళలు ఏఆర్ కానిస్టేబుళ్లు రానున్నారు. వీరితో పాటు 16మంది అగ్నిమాపక శాఖ, ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు కూడా విధుల్లో చేరనున్నారు. ఎస్పీ వీరికి పోస్టింగ్ కల్పించనున్నారు. కాగా, జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో కొందరి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment