కారు అద్దం పగులగొట్టి నగదు చోరీ
● రూ.1.80 లక్షలు అపహరణ ● నిర్మల్ జిల్లా భైంసాలో ఘటన
భైంసాటౌన్(ముధోల్): భైంసా పట్టణం నడిబొడ్డున నిలిపి ఉంచిన ఓ కారులో నుంచి నగదు ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. లోకేశ్వరం మండలంలోని గడ్‌చాందకు చెందిన బీడీ కంపెనీ నిర్వాహకుడు అల్లం భోజన్న రూ.50వేల నగదుతో కారులో భైంసాకు వచ్చాడు. ముందుగా నిర్మల్ రోడ్‌లోని ఎస్‌బీఐలో మరో రూ.90వేల నగదు డ్రా చేసుకున్నాడు. అక్కడి నుంచి బస్టాండ్ పక్కన గల ఎస్‌బీఐ వద్దకు వెళ్లాడు. అక్కడ కారులో నగదు ఉన్న బ్యాగును ఉంచి పని నిమిత్తం బ్యాంక్‌లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా కారు అద్దం పగులగొట్టి ఉంది. అందులో నగదు బ్యాగ్ కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఎండీ గౌసుద్దీన్ వచ్చి వివరాలు సేకరించారు. సీసీ పుటేజీలు పరిశీలించగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment