రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి
ఉట్నూర్‌రూరల్: ఆదివాసీ హక్కుల సాధనకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ బుర్స పోచయ్య పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో నిర్వహించిన తుడుం దెబ్బ జిల్లా మహాసభలకు నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల తుడుం దెబ్బ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాలకు వలసవాదులు వచ్చి గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందడంతో పాటు అన్ని రకాలుగా వంచిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై ఆదివాసీ హక్కుల పోరాట సమితి పోరు ప్రారంభించిందని చెప్పారు. అనంతరం తుడుం దెబ్బ మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా కమిటీని ఈ నెల 23న ఖానాపూర్‌లో జిల్లా సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నట్లు తెలిపారు. నాయకులు గోడం నణేశ్, పుర్కబాపురావు, గోడం నగేశ్, కుడిమెత తిరుపతి, గుర్రాల రవీందర్, పంద్ర జైవంత్‌రావు, కోట్నాక్ విజయ్, ఆత్రం ఆనంద్‌రావు, పెందూర్ పుష్పరాణి, రేణుకాబాయి, ఆత్రం మోతీరాం, సిడాం సోనేరావ్, బాజీరావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment