మత్తుకు బానిసైతే జీవితం చిత్తే
సారంగపూర్: గంజాయి, సిగరెట్, మద్యం, ఇతర డ్రగ్స్‌కు బానిసలుగా మారితే జీవితాలు చిత్తవుతాయని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్‌రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ చైర్మన్ డాక్టర్ సాప పండరి అన్నారు. చించోలి(బి) ఎక్స్‌రోడ్డు సమీపంలోని మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు బుధవారం మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలను తీసుకోవడం వలన క్రమేణా ఆరోగ్యం క్షీణించి క్యా న్సర్ బారిన పడతారన్నారు. తద్వారా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతుందన్నారు. వాటికి దూ రంగా ఉండి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తూసింగ్, జిల్లా మహిళా విభాగం చైర్మన్ అనూష, మండల చైర్మన్ పోలీస్ భీమేష్, ప్రతినిధులు సంజీవ్, మాటేగాం మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్, కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ అప్ప, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment