బిల్లులు చెల్లించాలి
మంచిర్యాల అగ్రికల్చర్/మంచిర్యాలటౌన్: జిల్లాలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు చేసిన ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల(ఆశ) సంఘం సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంహెచ్‌వో డాక్టర్ హరీశ్‌రాజ్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. గతంలో చేసిన లెప్రసీ, పల్స్ పోలియో, ఎండీఏకు సంబంధించిన ప్రత్యేక పారితోషికం ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. లెప్రసీ ఇంటింటి సర్వే చేయకూడదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ డబ్బులు చెల్లిస్తే సర్వే ప్రా రంభిస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షురా లు వాణి, కార్యదర్శి సునీత, శ్రీలత, స్వప్న, సుజాత, లీల, పద్మ, సంధ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment