దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● ఘనంగా దివ్యాంగుల దినోత్సవం
మంచిర్యాలఅగ్రికల్చర్: దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మ హిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణితో కలిసి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హక్కులపై అవగాహన కలిగి ఉండాలని దివ్యాంగులకు సూచించారు. ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమస్యలపై ఆన్‌లైన్‌లో ఉన్న నంబర్‌కు వాట్సప్ ద్వారా దరఖాస్తు చేస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సంకల్పం, మనోధైర్యంతో ముందు కు సాగాలని సూచించారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన దివ్యాంగులను ఆదర్శంగా తీసుకో వాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖాధికారి నీరటి రాజేశ్వరి, గణపతి, ఇతర అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment