ఏ హామీలు నెరవేర్చారని సంబరాలు..?
● మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ● బీఆర్‌ఎస్ నేతలు, హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడి అరెస్టు
జైపూర్: ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చారని ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించా రు. మహిళలకు రూ.2,500 ఇచ్చారా.. రూ.4వేలు పింఛన్ చేశారా.. గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనా.., ఆటోడ్రైవర్లు, రైతులు ఆ త్మహత్య చేసుకుంటున్నారని సంబరాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. బుధవారం పెద్దపల్లి లో సీఎం రేవంత్‌రెడ్డి సభ నేపథ్యంలో చందర్‌తో పాటు హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మ ద్, బీఆర్‌ఎస్, ధర్మసమాజ్ పార్టీ నాయకులను అరె స్టు చేసి జైపూర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ను కాపాడాలని, కొత్త గనులు ఏర్పాటు చేయాలని ప్రశ్నిస్తే కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చే యడం పద్ధతి కాదని అన్నారు. హైడ్రా పేరుతో ని రుపేదల ఇళ్లను కూలగొట్టి రోడ్డు పాలు చేస్తోందని, గోదావరిఖనిలో ఎమ్మెల్యేఆగడాలు అదుపులేకుండా పోతున్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment