‘ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం కులమతా లను చూడదని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యే యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం మహిళా సంఘాల సభ్యులకు రూ.6 కోట్ల రుణాల చెక్కు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు 211 చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు 193మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ పార్టీ చేసిందేమీ లేదని, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించలేని దుస్థితిని కల్పించారని తెలిపారు. తాను గెలిచిన వెంటనే గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీటిని చివరి కాలువ వరకు అందించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపాలన విజ యోత్సవాల జిల్లా కోఆర్డినేటర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహారుద్దీన్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్, నస్పూర్ చైర్మన్ వేణు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment