సంక్రాంతిలోగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయాలి
రామకృష్ణాపూర్: సంక్రాంతి పండుగలోగా క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి నిర్మాణపు పనులను బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరైన రెండు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలలో రామగుండం బ్రిడ్జి ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా క్యాతనపల్లి ఆర్వోబీ 11 ఏళ్లుగా పూర్తి కాలేదని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. మంచిర్యాలలో వందేభారత్ రైలుకు హాల్టింగ్ ఇచ్చేలా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని, కాగజ్‌నగర్–తిరుపతి మధ్య కొత్త రైలు ఏర్పాటుకు ఇటీవలే కేంద్ర రైల్వేమంత్రిని కలిశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రాజు, పీసీసీ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, పల్లె రాజు, శ్యాంగౌడ్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్‌అజీజ్, గోపతి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment