సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి ఉద్యోగుల సంఘం రా ష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. బుధవా రం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మికులకు ఇచ్చిన హా మీలు నెరవేర్చాలని అన్నారు. సింగరేణి కార్మికుల కు సొంతింటి పథకం అమలు చేయాలని, మారు పేర్లతో ఉన్న కార్మికుల పేర్లు సరి చేయాలని, వారసత్వ ఉద్యోగాల్లో 10వ తరగతి నిబంధన ఎత్తివేయాలని అన్నారు. సంవత్సరానికి 10 భూగర్భ బా వులు ప్రారంభించాలని, మెడికల్ బోర్డు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, మహిళా కార్మికులకు పని స్థలాల్లో సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరటి రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ జైపాల్‌సింగ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవి సత్యం, సమ్ము రాజన్న, బెల్లంపల్లి రీజియన్ నాయకులు వెంగళ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment