‘మాలల ఐక్యతను ఢిల్లీకి చాటిన ఎమ్మెల్యే వివేక్’
పాతమంచిర్యాల: మాలల ఐక్యత, సత్తాను ఢిల్లీకి వినిపించేలా మాలల సింహగర్జన సభ విజయవంతానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి కృషి చేశారని మాల జేఏసీ, మాల ఉద్యోగుల జేఏసీ నా యకులు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎ మ్మెల్యే వివేక్‌ను పూలమాలలు, శాలువాలతో ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా జేఏసీ నా యకులు మాట్లాడుతూ రాజ్యాంగ రక్షణ, అంబేడ్క ర్ భావజాలం, సిద్ధాంతాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వివేక్ వెన్నంటే ఉంటామని అన్నారు. మాల జేఎసీ, మాల ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్, కో కన్వీనర్లు కూన సుధాకర్, జూపాక సుధీర్, గజెళ్లి లక్ష్మణ్, కుంబాల రాజేష్, పొట్ట మధుకర్, ముత్తమాల పుల్లయ్య, భూపెల్లి మల్లన్న, కాసర్ల యాదగిరి, పలిగిరి కనకరాజు, మండల రవికుమార్, దేవరపల్లి మధు, మనోజ్, బైరం ప్రభాకర్, నీలం వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment