మంచిర్యాలఅగ్రికల్చర్: ఇంటర్ విద్యార్థుల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్యతో కలిసి సంక్షేమశాఖల అధికా రులు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రి న్సిపాల్‌లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మా నసిక వైద్యనిపుణుడు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యసేవలందించనున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా 14416 నంబర్ ద్వారా టెలీ మానస్ సేవలు పొందవచ్చని సూచించారు. ప్రతీ కళాశాల నుంచి ఒక నోడల్ అధికారి ఐఎస్వో రిజి స్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో 13,018 మంది విద్యార్థులకు యూ–డైస్ పోర్టల్‌లో 11,500 మంది వివరాలు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు త్వరగా నమోదు చేసుకునేలా యాజమాన్యాలు చర్య తీసుకోవాలని కోరారు. ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవడంలో అనుసరించే విధానాన్ని విద్యార్థులకు వివరించాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment