చర్లపల్లిలో చిరుత సంచారం
బెల్లంపల్లిరూరల్: మండలంలోని చంద్రవెల్లి పంచాయతీ పరిధి చర్లపల్లి గ్రామ శివారు అట వీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం ఉదయం గ్రామస్తులు పొలాలు, చేలకు వెళ్లే మార్గంలో చిరుతపులి పాదముద్రలను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పాదముద్రలు గుర్తించి చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. ఆయన మాట్లాడుతూ.. చిరుతపులి రాత్రివేళ ఈ ప్రాంతంలోకి వచ్చినట్లు తెలిపారు. రాత్రి ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామస్తులకు సూచించా రు. వన్యప్రాణులకు హాని కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. చిరుత సంచారంతో చర్లపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment