చెన్నూర్ అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి ● లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
భీమారం: చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కోతు ల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేకు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి కల్పన, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో మధుసూదన్, నాయకులు రవి, సత్యనారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
రూ.125కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
జైపూర్: నియోజకవర్గంలో రూ.125కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించుకోవడం జరుగుతుందని ఎ మ్మెల్యే వివేక్‌వెంకటస్వామి తెలిపారు. టేకుమట్లలో ఇటీవల సింగరేణి రైల్వేట్రాక్‌లైన్‌కు తీసిన గుంతలో పడి చిప్పకుర్తి రాజ్‌కుమార్ మరణించగా అతడి కు టుంబానికి యాజమాన్యం ద్వారా మంజూరైన రూ.15లక్షల పరిహారం చెక్కును కలెక్టర్ దీపక్‌కుమార్‌తో కలిసి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ.. నియోజకవర్గంలో రూ.70కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. భీమారం జోడువాడు వద్ద రూ.180కో ట్లతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రాథమికో న్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. స్థానిక రైతులు పా ర్వతీబ్యారేజీ ముంపు కింద సుమారు 150ఎకరాల్లో పంట పొలాలు నష్టపోతున్నామని, స్థానికంగా తాగునీటి సమస్య ఉందని బోర్లు వేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో శ్రీపతిబాపురావు, నాయకులు గోనె నర్సయ్య, సత్యనారాయణరావు, వెంకటేశ్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఫయాజ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment