ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
మంచిర్యాలటౌన్: ప్రతి ఒక్కరికీ ఎయిడ్స్, హెచ్‌ఐవీ పై అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అ ధికారి హరీశ్‌రాజ్ సూచించారు. డీఎంహెచ్‌వో కా ర్యాలయంలో మంగళవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పాల్గొన్నారు. హెచ్‌ఐవీ, ఎ యిడ్స్‌పై విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి వి జేతలకు బహుమతులు అందించారు. అనంతరం హెచ్‌ఐవీపై అపోహలను తొలగించడంలో భాగస్వాములవ్వాలని కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. బెల్లంపల్లి ఉప వైద్యాధికారి సుధాకర్‌నాయక్, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రసా ద్, పీవో డాక్టర్ అనిల్, డెమో వెంకటేశ్వర్లు, డీపీవో ప్రశాంతి, సీపీఎం నీలిమ, సీఎస్‌వో రాజేశ్, డీఎండీవో సంతోష్, ఐసీటీసీ కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, జగన్మోహన్, ఆంజనేయులు, నర్మద, డీఎస్‌ఆర్సీ కౌన్సిలర్ నరేందర్, ఉపాధ్యాయులు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment